సంగారెడ్డి, 2026-08-05
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల సమాఖ్యలు సమన్వయంతో పని చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) జ్యోతి సూచించారు. బుధవారం జిల్లా సమాఖ్య (107) సమావేశం జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు యోగేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల సమాఖ్యలు సమన్వయంతో పని చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) జ్యోతి సూచించారు. బుధవారం జిల్లా సమాఖ్య (107) సమావేశం జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు యోగేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత తదితర అంశాలపై మండల సమాఖ్య అధ్యక్షులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) జ్యోతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలో సమాఖ్యల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) జానకి రెడ్డి, అదనపు డీఆర్డీఓడీఆర్డీఏ అధికారులు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, వయోజన విద్య ఉప సంచాలకులు, టాస్ () జిల్లా కోఆర్డినేటర్, ఎస్బీఐ ఆర్సెటీఐ మేనేజర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి, ఏడిఎన్ఏసీ, డీసీసీబీ జనరల్ మేనేజర్, ఎస్పీఎంఎస్ఈఆర్పీ తదితర శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.











