ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో కోచింగ్ క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న 17 ఏళ్ల సిక్కు విద్యార్థిపై ముగ్గురు విద్యార్థులు దాడి చేశారు. విద్యార్థిని కొట్టడంతో పాటు జుట్టు పట్టుకుని లాగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోచింగ్ క్లాస్ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న 17 ఏళ్ల సిక్కు విద్యార్థిని ముగ్గురు యువకులు అడ్డుకుని దాడి చేశారు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలోనే ఈ ఘటన జరగడం, చుట్టూ ప్రజలు ఉన్నప్పటికీ ఎవరూ అడ్డుకునేందుకు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసుల వివరాల ప్రకారం, సోమవారం సాయంత్రం విద్యార్థి కోచింగ్ నుంచి ఇంటికి వెళ్తుండగా రాజ్‌ఘాట్ పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలో ఈ దాడి జరిగింది. నిందితులు కూడా విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. పాత కక్షల కారణంగానే అతడిపై దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నారు.












