కన్నౌజ్
ఉత్తరప్రదేశ్‌లోని జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను కుర్చీకి కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లాలోని జగత్పూర్ గ్రామానికి చెందిన సుఖ్బీర్ సింగ్‌కు తన భార్య సోనమ్‌తో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని సుఖ్బీర్ అనుమానించేవాడని, ఈ కారణంగా తరచూ వేధించేవాడని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.












