ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి వచ్చిన కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ వన్‌ప్లస్ 16 ప్రస్తుతం చైనా మార్కెట్లో మాత్రమే విడుదల అయింది. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో దీని విడుదలపై స్పష్టత లేకపోవడంతో వినియోగదారులు నిరాశ చెందుతున్నారు. అమెరికా, ఐరోపా మార్కెట్లలో వన్‌ప్లస్ కొత్త ఫోన్ల విడుదలను నిలిపివేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
వన్‌ప్లస్ 16లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 9,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వేగంగా ఛార్జింగ్ చేసుకునేందుకు 100 వాట్ల వైర్డ్ ఛార్జింగ్, 50 వాట్ల వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అధునాతన డిస్ప్లే, కెమెరా
ఈ ఫోన్లో 6.78 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. గేమింగ్ సమయంలో 185 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఉండటం వల్ల వేగవంతమైన గేమింగ్ అనుభవం లభించవచ్చని అంచనా. సాధారణ వినియోగంలో గరిష్ఠంగా 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ పనిచేస్తుందని సాంకేతిక నివేదికలు వెల్లడించాయి. ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి తోడు 50 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ప్రత్యేక ఎల్ఈడీ లైటింగ్ కూడా ఉంది. కాల్స్, సందేశాలు, ఇతర నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఈ లైట్లు సంకేతాలివ్వగలవని నివేదికలు పేర్కొన్నాయి.











