ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నామినేషన్ల దశ నుంచే అక్రమాలు మొదలయ్యాయని, పోలీసుల సహకారంతో రిగ్గింగ్ చేశారని ఆయన ఆరోపించారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నామినేషన్ల దశ నుంచే అక్రమాలు మొదలయ్యాయని, స్క్రూటినీ, విత్‌డ్రా ప్రక్రియలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తొలగించారని ఆయన ఆరోపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (), జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని విమర్శించారు. అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఓటమి భయంతో 37 స్థానాలకు గాను 30 స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారని అన్నారు.










