రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) రద్దుపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఎస్.టి.యు. రాష్ట్ర అధ్యక్షులు మల్లు రఘునాథ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కడపలో జరిగిన ఎస్.టి.యు. ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
పీఆర్సీ కమిటీ ఏర్పాటు ప్రక్రియను జాప్యం లేకుండా పూర్తి చేయడానికి వీలుగా వెంటనే కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని మల్లు రఘునాథ రెడ్డి డిమాండ్ చేశారు. వేతన సవరణకు సంబంధించిన అంశాలను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పెరుగుతున్న జీవన వ్యయం, ఆర్థిక భారాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు న్యాయమైన వేతన సవరణ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణను ప్రకటిస్తే ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో నెలకొన్న అనిశ్చితి తొలగుతుందని అన్నారు.











