కడపలో పర్యటిస్తున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మను మండలానికి చెందిన టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో మండలానికి సంబంధించిన పలు ముఖ్యమైన సమస్యలు, అభివృద్ధి అంశాలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు.
జెరికోన నుంచి మండలానికి తాగునీరు, సాగునీటి సరఫరా సమస్యను పరిష్కరించి, నిధులు మంజూరు చేయాలని కోరారు. చిన్నేపల్లె నుంచి సానిపాయి వరకు అత్యవసరంగా అవసరమైన డబుల్ రోడ్డు నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికలపై చర్చ











