రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కడపలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పోలీసులే రౌడీలుగా మారుతున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లే ముఖ్య కారకులని ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు చేసి అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఈ దుర్మార్గపు పాలన వద్దని ప్రజలు కోరుకుంటున్నారని, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫున బలమైన అభ్యర్థులను బరిలో దింపుతామని ఆయన తెలిపారు. వైసీపీ కార్యకర్తలు అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
శాంతిభద్రతలపై విమర్శలు











