జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. వైఎస్ జగన్‌ను రాష్ట్రానికి పట్టిన దరిద్రం అనడం సరికాదని, ఆయన గొప్ప వ్యక్తి అని రెడ్యం అన్నారు.
కడప నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్‌ను రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంటూ జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దరిద్రుడికి గొప్ప వ్యక్తులు కూడా దరిద్రుల్లాగే కనిపిస్తారని విమర్శించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించి 95 శాతానికి పైగా హామీలను అమలు చేసిన నేత వైఎస్ జగన్ అని, అలాంటి వ్యక్తిని విమర్శించడం సరికాదని రెడ్యం అన్నారు. చదిపిరాళ్ల కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్నే కూల్చివేయించిన చరిత్ర ఆదినారాయణరెడ్డిదని ఆరోపించారు.










