సెల్ ఫోన్ దొంగిలించి, అందులోని యూపీఐ () ద్వారా లక్షకు పైగా డబ్బును బదిలీ చేసుకుని, ఆన్లైన్ బెట్టింగ్‌లో పోగొట్టుకున్న నిందితుడిని కడప రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుడు సామ్సన్, తండ్రి చిదానంద, బాపూజీ నగర్, బళ్లారి టౌన్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నిన్న రాత్రి కడప రైల్వే స్టేషన్ పరిధిలో ప్రయాణికుల వద్ద నుండి ఒక సెల్ ఫోన్ దొంగిలించాడు. అనంతరం ఆ ఫోన్లోని యూపీఐ () యాప్ ద్వారా బాధితుల ఖాతా నుండి రూ. 1,07,103 నగదును తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. ఆ మొత్తాన్ని ఆన్లైన్ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కేసు నమోదు, దర్యాప్తు












