వైఎస్ఆర్ జిల్లాలోని , చక్రాయపేట మండలాల్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు కుటుంబాలను పరామర్శించి, గ్రామ కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.
మండలం నాగూరు గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నాగేల్ల రాంప్రసాద్ రెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి నేరుగా రాంప్రసాద్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం తువ్వపల్లి గ్రామంలో గుండెపోటుతో బాధపడుతూ, ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ఎంపీటీసీ వెంకటనారాయణ రెడ్డిని ఎంపీ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.









