మాజీ భారత రాష్ట్రపతి, శాస్త్రవేత్త స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. కలాం జీవితం, ఆయన సందేశాలు యువతకు ఆదర్శప్రాయమని, స్ఫూర్తినిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
గురువారం రాజంపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాజీ భారత రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం 95వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు నివాళులర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ, శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశాభివృద్ధికి విశేష కృషి చేసిన కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు.











