స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు, చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను చెన్నూరు పోలీస్ స్టేషన్ సి.ఐ చాంద్ బాషా సంబంధిత అధికారులతో కలిసి సంయుక్తంగా పరిశీలించారు.
చిన్నమాచుపల్లి, పాలెంపల్లి, బచ్చుం పల్లి, కేకే కోట్టాలు, రూకావారిపల్లి ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సీఐ చాంద్ బాషా సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వసతులు, భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
అవసరమైన ముందస్తు చర్యలపై సమీక్షలు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని సీఐ తెలిపారు.











