ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలపై పూర్తి అవగాహనతో తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లో ఆర్ఓలు, ఏఆర్ఓలు, ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ఈ సూచనలు చేశారు.
గురువారం కడప కలెక్టరేట్లోని సభా భవనంలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమానికి జేసీ డా. నిధి మీనా అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన, కడప ఆర్డీవో మురళీ, డిప్యూటీ కలెక్టర్లు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ సందర్భంగా ఎన్నికల మార్గదర్శకాల పుస్తకాలను అందజేసి, ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు, అధికారుల విధులు, బాధ్యతలను జేసీ వివరించారు. ఎన్నికల విధులకు సంబంధించి అధికారులకు ఎదురయ్యే సందేహాలను అడిగి తెలుసుకుని, వాటిని నివృత్తి చేశారు.











