రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఎస్సీ మోర్చా విభాగానికి దామాషా ప్రకారం సీట్లు కేటాయించలేదని ఆరోపిస్తూ ఎస్సీ మోర్చా నేతలు రాజీనామా బాట పట్టారు. రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలకు న్యాయమైన వాటా దక్కని పరిస్థితుల్లో, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతల సురేష్ తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని రాష్ట్ర ఎస్సీ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్చార్జ్, బీజేపీ నాయకులు మొగరాజు రమణయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
పనతల సురేష్ బాటలోనే తాము కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నామని ఆయన ప్రకటించారు. అదే విధంగా రాష్ట్రంలోని జిల్లాల ఎస్సీ మోర్చా పదాధికారులు, ఆయా జిల్లాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పదాధికారులు మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆరోపణలు, ఆవేదన











