కడప నగర మేయర్, కార్పొరేటర్ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని వైఎస్సార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి ఎన్నికల అధికారులను కోరారు. శుక్రవారం కడపలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు.
ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆమె సూచించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే ఓటర్ స్లిప్పులను సకాలంలో అందించాలని ఆమె కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా, నియమావళిని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలు నిర్వహించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.











