Nalgonda/Pedda Adiserla Pally (డాక్సిన్ టైమ్స్) జూలై 02
ఆర్కే బీచ్ లో మద్యం అమ్మకాలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం. 363ను తక్షణమే రద్దు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద వినూత్నంగా ధర్నా చేపట్టారు. జీవోను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
విశాఖపట్నం: ఆర్కే బీచ్ లో మద్యం అమ్మకాలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం. 363ను వెంటనే వెనక్కి తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద వినూత్నంగా ధర్నా చేపట్టారు. జీవోను రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు 32, 33, 35, 39 వార్డుల అధ్యక్షులు ఈ ధర్నాను నిర్వహించారు. వార్డు అధ్యక్షులు పిన్నింటి రాజారెడ్డి, ముత్త బత్తుల రమేష్, అలుపన కనకారెడ్డి, ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, టిడిపి నాయకుల వేషధారణలో ఉన్నవారిని బీర్లతో స్నానం చేయించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆహ్లాదం, ఆనందం, ప్రశాంతత అందించే విశాఖ సాగర తీరాన్ని మద్యపాన ప్రాంతంగా మారుస్తారా అని ప్రశ్నించారు. సంపద సృష్టి అంటే ఇదేనా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై ధ్వజమెత్తారు. నగర ప్రశాంతతకు, స్థానిక సంస్కృతికి విఘాతం కలిగించే జీవో (363)ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.











