కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ వ్యవహారంపై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు నిరసనకు దిగారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ () విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్ నిర్వహించారు.
ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, ఓటర్ల హక్కుల పరిరక్షణపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాలు, ముఖ్యంగా అమలుపై తమ అభ్యంతరాలను ప్రతిపక్ష నేతలు వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిరసనలో పాల్గొన్న నాయకులు
ఈ నిరసనలో కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలోని పలు పార్టీలకు చెందిన ఎంపీలు, నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు ఓటర్ల జాబితా కీలకమని, అందులో ఎలాంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా చూడాలని ప్రతిపక్ష నేతలు కోరారు.











