ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా తన అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని నాగేందర్ చెప్పారు. ప్రజా జీవితంలో మళ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే ఉప ఎన్నికలో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని ఇప్పుడే వెల్లడించబోనని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే తన పార్టీపై నిర్ణయం చెబుతానని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఖైరతాబాద్ సీటుపై తదుపరి ప్రక్రియ
దానం నాగేందర్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.











