ఆంధ్రప్రదేశ్‌లోని 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇందులో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 138 కౌంటింగ్ కేంద్రాలు, 556 హాళ్లు, 6,831 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు.
మొత్తం 3,186 వార్డుల ఓట్లను లెక్కించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియలో కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు సహా 47,817 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లలో పారదర్శకత కోసం 1,372 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 13 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 804 డివిజన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని 2,382 వార్డులు కలిపి మొత్తం 3,186 వార్డుల ఓట్లను లెక్కించనున్నారు.











