కామారెడ్డి, 2026-07-23
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనతోనే ఎమ్మార్పీఎస్ బాధ్యత తీరిపోలేదని, ఇకపై కుల, మతాలకు అతీతంగా భవిష్యత్తు ఉద్యమాలను నిర్మించాలని నిర్ణయించినట్లు ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలను రద్దు చేసి, నూతన తరం, యువతరం తో సంస్థాగత నిర్మాణ ప్రక్రియను ప్రారంభించినట్లు, ఇది కామారెడ్డి జిల్లాలో కూడా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

మాదిగ ఉద్యమం మానవతా ఉద్యమమని, మందకృష్ణ మాదిగ పోరాటంలో అన్ని వర్గాలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సామాజిక ఉద్యమ నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సమాజంలో అణగారిపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులు, అగ్రకుల పేదల సంక్షేమానికి, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భవిష్యత్తు ఉద్యమాలు నిర్ణయిస్తాయని తెలిపారు.
మాదిగ, ఎస్సీ ఇతర కులాల న్యాయబద్ధమైన సమస్యల వర్గీకరణ సాధన కోసం 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం దేశంలో సాధారణ విషయం కాదని, ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, కుట్రలు, అణచివేతలు, వెన్నుపోట్లు ఎదుర్కొంటూనే విజయం సాధించిందని ఆయన అన్నారు. న్యాయబద్ధం కాని సమస్యను ముట్టుకోని, న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వదిలిపెట్టని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 32 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో వర్గీకరణతో పాటు అనేక సామాజిక సమస్యల పరిష్కారం సమాజం గుర్తించిందని తెలియజేశారు.