పేద ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఇంటి స్థలాలు, ఇళ్ల హక్కుల సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో 26,401 మంది పేద కుటుంబాలకు నివాస స్థలాల పట్టాలు అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏళ్ల క్రితమే ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నప్పటికీ, ఆ ఇళ్లపై అధికారిక హక్కులు లేని వారికి కూడా హక్కులు కల్పించే నిర్ణయం తీసుకుంది.
ఇళ్ల స్థలాలకు పట్టాలు, నివాస హక్కులు కల్పించడం ద్వారా పేద కుటుంబాలకు ఆస్తిపై చట్టబద్ధమైన భద్రత ఏర్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు తమ ఇల్లు ఉన్నప్పటికీ దానికి సంబంధించిన హక్కు పత్రాలు లేకపోవడంతో అనేక కుటుంబాలు రుణాలు, ఇతర ఆర్థిక అవసరాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పట్టాలు అందడంతో ఆయా కుటుంబాలకు తమ నివాసాలపై హక్కు మరింత స్పష్టంగా ఏర్పడనుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాష్ట్రవ్యాప్తంగా విశాఖపట్నం, మంగళగిరి, జిల్లాల్లో సుమారు 60 వేల పేద కుటుంబాలకు రూ.52 వేల కోట్ల విలువైన ఆస్తులపై హక్కులు కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ చర్యతో ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఊరట లభించింది. ఇది పేదల సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు, వారు నివసిస్తున్న ఇళ్లపై హక్కులు కల్పించడం ద్వారా వారి ఆత్మగౌరవాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.











