కామారెడ్డి, 13 September
హమార ప్రసాద్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్ చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు , అంబేద్కర్ ప్రతినిధులు మద్దతు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
*హమార ప్రసాద్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని దీక్ష* కామారెడ్డి: హమార ప్రసాద్‌పై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్ చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు MRPS, అంబేద్కర్ ప్రతినిధులు సంఘీభావం తెలిపి మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. హమార ప్రసాద్ వ్యాఖ్యలపై ప్రభుత్వం, పోలీసులు వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం, దళితులు, గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించరాదన్నారు. కొంగల వెంకట్ చేపట్టిన నిరాహార దీక్షకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో MRPS మాజీ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకట రాములు, జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి, అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు కోతోల గంగారాం, ద్యామని భూపతి, లెగ్గేలా రాజు, ర్యగల రాజు, దేవరాజు, సురేష్, సత్యం, ప్రభాకర్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.











