విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈనెల 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు భక్తులను ఆహ్వానించిన ఆలయ అధికారులు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈనెల 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు రావాలని ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులను ఆహ్వానించారు. ఈ మేరకు ఉండవల్లిలోని నివాసంలో ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు కలిసి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆలయ అర్చకులు ప్రత్యేకంగా వేదాశీర్వచనం అందించారు. అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. దసరా మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, అమ్మవారి వివిధ అలంకార సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.











