డాక్సిన్ టైమ్స్: కోటక్ మహీంద్రా బ్యాంక్ తదుపరి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అనూప్ కుమార్ సాహా నియమితులయ్యారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆమోదం అనంతరం ఈ నియామకాన్ని బ్యాంక్ ప్రకటించింది. సాహా జనవరి 1 నుంచి మూడేళ్ల కాలానికి బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రస్తుతం సీఈఓగా ఉన్న అశోక్ వాస్వానీ పదవీకాలం తో ముగియనుంది. అనూప్ కుమార్ సాహా 2000 లో కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో చేరారు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆయన రిటైల్ బ్యాంకింగ్, ప్రభుత్వ వ్యాపారం, డేటా అనలిటిక్స్, మార్కెటింగ్ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. ఆర్థిక సేవల రంగంలో ఆయనకు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో చేరకముందు సాహా బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. బజాజ్ ఫైనాన్స్‌లో పలు సీనియర్ హోదాల్లో పనిచేసిన ఆయన 2025లో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఐసీఐసీఐ బ్యాంక్‌లో రిటైల్ సెక్యూర్డ్ అసెట్స్, క్రెడిట్ కార్డులు, క్రెడిట్ తదితర విభాగాల్లో పనిచేశారు.











