సుండుపల్లి (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 11
రాజంపేట పార్లమెంటు సభ్యులు ఎంపి పివి. మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు సుండుపల్లి మండలం వానపల్లి తండాలో ప్రజల మధ్య తండాలో ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర నాయక్ చౌహాన్ ఈ వివరాలను తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఘనంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు. రాజంపేట పార్లమెంటులోని సుండుపల్లి మండలం వానరాచపల్లి తండాలో, తండా ప్రజల మధ్య రాజంపేట పార్లమెంటు సభ్యులు ఎంపి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర నాయక్ చౌహాన్ తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్ర నాయక్ చౌహాన్ మాట్లాడుతూ ఓటమి ఎరుగని నేత, ప్రజా బాంధవుడు, రాజంపేట పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ ప్యానల్ స్పీకర్ అయిన మా అభిమాన నేత పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదినం సందర్భంగా వానరాచపల్లి తాండా ప్రజల మధ్య కేకు కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా తాండా ప్రజలు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారన్నారు. ఈ సందర్భంగా కేకులు కట్ చేసి, ప్రజలు పంచిపెట్టి మిథున్ రెడ్డి పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వానరాచ పల్లి తండా ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారన్నారు ఆయన.











