భారత ప్రధాన న్యాయమూర్తి () జస్టిస్ సూర్యకాంత్ రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యవహారం కేరళ కాంగ్రెస్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ పోస్టుపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందిస్తూ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ () కార్యవర్గ సభ్యులకు ధిక్కార నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థ అధికారాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణిస్తామని ధర్మాసనం హెచ్చరించింది.
కేరళ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో న సీజేఐ సూర్యకాంత్‌ను ఉద్దేశించి ఒక పోస్టు ప్రచురితమైంది. ఆయన రాజీనామా చేయాలని, అవసరమైతే మరో వ్యక్తిని ఆ పదవిలో నియమించుకుంటామని అందులో పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ పోస్టుపై తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు. అనంతరం పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేసిన సంబంధిత వ్యక్తిని బాధ్యతల నుంచి తొలగించినట్లు కాంగ్రెస్ తెలిపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ వ్యవహారాన్ని విచారించింది. న్యాయమూర్తుల తీర్పులను విమర్శించే హక్కు ప్రజలకు ఉందని, అయితే భావప్రకటన స్వేచ్ఛ పేరుతో న్యాయపాలనకు ఆటంకం కలిగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. న్యాయస్థానాల అధికారాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను కఠినంగా ఎదుర్కొంటామని ధర్మాసనం హెచ్చరించింది. రాజ్యాంగమే అత్యున్నతమని, ఏ వ్యక్తి లేదా రాజకీయ సంస్థ దాని కంటే గొప్పది కాదని వ్యాఖ్యానించింది.










