బిబిపేట్, 13 September
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దళితులు, బలహీన వర్గాలను రాజకీయంగా అణచివేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ ఆరోపించారు. ఆదివారం కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
*బీజేపీ–బీఆర్ఎస్ల ఎజెండా ఒక్కటే: జహీర్ అక్తర్* : బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దళితులు, బలహీన వర్గాలను రాజకీయంగా అణచివేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ ఆరోపించారు. ఆదివారం కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పేర్లు వేరైనా రెండు పార్టీల రాజకీయ ఎజెండా ఒక్కటేనని, దళితులు, బలహీన వర్గాల హక్కులను హరించడమే వారి విధానంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్న కార్యక్రమం అనంతరం ఆ ప్రదేశాన్ని బీజేపీ–ఆర్ఎస్ఎస్ శుద్ధి చేశారనే ఘటన దళితుల పట్ల వారి మనువాద భావజాలానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ నేతలు అనుచిత, అన్‌పార్లమెంటరీ భాషతో అవమానించారని ఆరోపించారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో దళిత ముఖ్యమంత్రి, ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి వంటి హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. ‘దళిత బంధు’ పథకం ద్వారా అందరికీ సమాన న్యాయం జరిగిందా? అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై కూడా జహీర్ అక్తర్ విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్లో ఉన్న దళిత, బలహీన వర్గాల నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును ఆలోచించి కాంగ్రెస్‌లో చేరాలని పిలుపునిచ్చారు. మేధావులు, విద్యార్థులు, యువత, దళితులు, బలహీన వర్గాల ప్రజలు ఏకమై రాజ్యాంగం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్, జిల్లా ఉపాధ్యక్షులు పండ్ల రాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు భూమని బాలరాజ్, మండల అధ్యక్షులు రాజా గౌడ్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, కిషన్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పాత రాజు తదితరులు పాల్గొన్నారు.











