న్యూజిలాండ్-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత్-ఏ జట్టు అద్భుతంగా పోరాడింది. యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, యశ్ రాథోడ్ శతకాలతో చెలరేగడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి రోజు భారత్-ఏ రెండో ఇన్నింగ్స్‌లో 282 పరుగులు చేసింది.
న్యూజిలాండ్-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత్-ఏ జట్టు అద్భుతంగా పోరాడింది. భారత యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, యశ్ రాథోడ్ శతకాలతో చెలరేగడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరిగిన ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో చివరి రోజు భారత్-ఏ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి ముందు 204 పరుగుల ఆధిక్యం సాధించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తడబాటు
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ధ్రువ్ జురెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 105 పరుగులు సాధించాడు. దేవదత్ పడిక్కల్ 80 పరుగులతో రాణించగా, ఆకాష్ దీప్ 68 పరుగులు చేశాడు. న్యూజిలాండ్-ఏ బౌలర్లలో ఫ్రేజర్ షీట్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.












