బాల్కొండ, 3 September
మండలంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) సర్టిఫికెట్ల జారీలో భారీ అవినీతి జరిగినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అర్హత లేని వ్యక్తులు అధికారులకు డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు పొంది, వాటిని విదేశీ విద్య, ప్రభుత్వ ఉద్యోగాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మండలంలో ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) సర్టిఫికెట్ల జారీలో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అర్హత లేని పలువురు వ్యక్తులు, అధికారులకు ముడుపులు చెల్లించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను పొందినట్లు సమాచారం. విదేశీ విద్య కోసం అర్హత లేకపోయినా సర్టిఫికెట్లు పొంది, ప్రభుత్వం నుంచి రూ. 20 లక్షల వరకు లబ్ధి పొందినవారు ఉన్నారని, మరికొందరు ఈ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించినట్లు ఆరోపణలున్నాయి. అధికారులు భారీగా లంచాలు తీసుకుని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను జారీ చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపై, అక్రమంగా పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిని అనర్హులను చేసి, వారిపై కూడా విచారణ చేపట్టాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.












