లక్ష్యంగా (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 03
జుక్కల్ పట్టణంలో ఆహారభద్రతాధికారివిక్రమ్ భద్రతాధికారి విక్రమ్ ఆధ్వర్యంలో గురువారం పలు ఆహార వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్లేకుండావ్యాపారాలు,లేబుల్నిబంధనలఉల్లంఘన:ఆహార లేకుండా వ్యాపారాలు నిర్వహించడం, ఆహార ఉత్పత్తులపై లేబుల్ నిబంధనలు పాటించకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పత్రికా ప్రకటన తేది:03.09.2026 జుక్కల్‌లో ఆహార భద్రతాధికారి తనిఖీలు నిబంధనలు పాటించని ఆహార వ్యాపార సంస్థలపై చర్యలు – ఆహార భద్రతాధికారి విక్రమ్ జుక్కల్ పట్టణంలో ఆహార భద్రతాధికారి విక్రమ్ ఆధ్వర్యంలో గురువారం కిరాణా, డిస్ట్రిబ్యూషన్ షాపులు, బేకరీలు, స్వీట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా పలు ఆహార వ్యాపార సంస్థలు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అదేవిధంగా కొన్ని ఆహార ఉత్పత్తులపై లేబుల్ నిబంధనలు పాటించకపోవడం, తయారీ తేదీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబర్ వంటి వివరాలు లేకపోవడాన్ని గుర్తించి, సంబంధిత వ్యాపారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. బేకరీల్లో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించడంతో సంబంధిత నిర్వాహకులకు మెరుగుదల నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆహార భద్రతాధికారి విక్రమ్ మాట్లాడుతూ, ఆహార వ్యాపార సంస్థల నిర్వాహకులు తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ పొందాలని సూచించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయ సమయంలో పరిశుభ్రతా ప్రమాణాలను పాటించాలని తెలిపారు. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబర్ తదితర తప్పనిసరి వివరాలు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా జిల్లాలో ఆహార వ్యాపార సంస్థలపై తనిఖీలు కొనసాగుతున్నాయని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రానున్న రోజుల్లో తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆహార వ్యాపార సంస్థల నిర్వాహకులు అధికారుల సూచనలు పాటించి, పరిశుభ్రతా ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని ఆహార భద్రతాధికారి విక్రమ్ సూచించారు.












