భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను ఉద్దేశించి కేరళ కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్టు వివాదంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ)పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ఫిర్యాదును సుప్రీంకోర్టు రిట్ పిటిషన్‌గా నమోదు చేసింది.
న్యాయవాది వినీత్ జిందాల్ న సీజేఐకి ఈ ఫిర్యాదు న పిటిషన్‌గా నమోదు చేసినట్లు కోర్టు వెబ్సైట్లో పేర్కొంది. కాంగ్రెస్ కేరళ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి న సీజేఐని ఉద్దేశించి ఒక పోస్టు చేశారు. చట్టవ్యవస్థ, శాంతిభద్రతలు మీ పరిధిలో లేకపోతే రాజీనామా చేయాలని, మీ స్థానంలో మరొకరిని నియమించుకుంటామని అందులో పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వివాదాస్పద పోస్టు, పార్టీ క్షమాపణ
ఈ పోస్టుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో పార్టీ దాన్ని తొలగించింది. పోస్టు చేసిన వ్యక్తిని బాధ్యతల నుంచి తొలగించినట్లు కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ తెలిపారు. పార్టీ నాయకత్వానికి తెలియకుండా, అనుమతి లేదా సంప్రదింపులు లేకుండానే ఈ సందేశం ప్రచురితమైందని ఆయన వివరణ ఇచ్చారు. సీజేఐకి, న్యాయవ్యవస్థ స్వతంత్రతకు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇస్తుందని పేర్కొంటూ క్షమాపణ కూడా తెలిపారు.











