భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంలో పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 20 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పేదల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకాల లక్ష్యమని ఆయన తెలిపారు.
మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు.












