రాష్ట్రంలో భూ సమస్యలు, వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, భూ యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పించే లక్ష్యంతో చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను మూడు దశల్లో పూర్తి చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే 285 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి, అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేశారు.
సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఇప్పటికే ఉన్న 411 రోవర్లకు అదనంగా మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయని మంత్రి పేర్కొన్నారు. భూ సర్వేలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి సంతృప్తే ప్రాధాన్యంగా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా భూ సమస్యలు లేని తెలంగాణ నిర్మాణం కోసం ప్రభుత్వం సమగ్ర రీసర్వేకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ అధికారులతో భూ సర్వే పురోగతిపై నిర్వహించిన సుదీర్ఘ సమీక్షలో ఆయన మాట్లాడారు.












