దోనకొండ, జులై 01
నంద్యాల జిల్లా డోన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ఎం. వేణుగోపాల్ రెడ్డి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన కార్యాలయంలో సిబ్బందితో సమావేశమై, శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
నంద్యాల జిల్లా డోన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ఎం. వేణుగోపాల్ రెడ్డి ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం, సిబ్బందితో సమావేశమై, శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తిస్తూ, అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల సహకారంతో, శాఖ సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తామని ఆయన పేర్కొన్నారు.












