రాజంపేట పట్టణంలో మార్కెట్ వెనుక ప్రధాన రహదారిపై డ్రైనేజీ కాలువపై ఉన్న బండ పగిలి పది రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పగిలిన బండ నుంచి బయటకు వచ్చిన ఇనుప కడ్డీలు రాత్రి వేళల్లో వాహనదారులకు, ప్రజలకు ప్రమాదకరంగా మారాయి.
రాజంపేట పట్టణం మార్కెట్ వెనుక ప్రధాన రహదారిలో డ్రైనేజీ కాలువపై వేసిన బండ పగిలి పది రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పగిలిన బండ నుంచి ఇనుప కడ్డీలు బయటకు వచ్చి కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో వాహనదారులు, నడిచి వెళ్లేవారు గమనించకుండా వాటిపై పడితే ప్రాణానికే ప్రమాదమని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది రద్దీగా ఉండే రహదారి కావడంతో, చిన్నపాటి అజాగ్రత్త కూడా పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది.












