కామారెడ్డి, 2026-09-01
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోర్టల్ ద్వారా వాటిని సులభంగా తిరిగి పొందవచ్చని కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.81 కోట్ల విలువైన 1133 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మొబైల్ ఫోన్ పోయిందని లేదా చోరీకి గురైందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సులభంగా తిరిగి పొందవచ్చని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు భరోసా ఇచ్చారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ కేవలం సమాచార సాధనమే కాకుండా, బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫోటోలు, కీలకమైన డేటాను కలిగి ఉండే అత్యంత ముఖ్యమైన పరికరమని ఆయన పేర్కొన్నారు. ఫోన్ పోగొట్టుకోవడం వల్ల వ్యక్తిగత భద్రతకు, గోప్యతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున, జిల్లా పోలీసు యంత్రాంగం మొబైల్ ఫోన్ల రికవరీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని వివరించారు.












