దేశవ్యాప్తంగా బ్యాంకు సిబ్బంది ఐదు రోజుల పనిదినాలు, 2024 వేతన సవరణ ఒప్పందం ప్రకారం అమలు చేయాలని కోరుతూ సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ సమ్మెకు ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసీ. బాదుల్లా విజ్ఞప్తి చేశారు.
29, 30 తేదీల్లో జరగనున్న సమ్మెకు ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శనివారం స్థానిక హోచిమిన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాదుల్లా మాట్లాడుతూ, ఎల్ఐసీ, ఆర్బీఐ, నాబార్డు, సాఫ్ట్వేర్ తదితర సంస్థల్లో ఐదు రోజుల పని విధానం అమల్లో ఉందని, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్స్‌తో జరిగిన చర్చల్లోనూ దీనిని అంగీకరించారని తెలిపారు. ఇప్పటికే రెండు శనివారాల సెలవులు ఉన్నాయని, మరో రెండు శనివారాల సెలవును అమలు చేయాలని, దీనికి రోజువారీగా అదనంగా 45 నిమిషాలు పనిచేస్తామని సిబ్బంది కోరుతున్నారని, కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే సమ్మె అనివార్యమవుతోందని బాదుల్లా అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రభుత్వ తీరుపై ఆగ్రహం












