స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా () తన ఖాతాదారులకు ముఖ్యమైన ప్రకటన చేసింది. ముఖ్యంగా, ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించే వారిపై కొత్త పరిమితులు విధించనున్నట్లు తెలిపింది. ఈ మార్పులు జీతం ఖాతాదారులను ప్రభావితం చేస్తాయి.
కడప: ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడే వారిపై కొత్త పరిమితులు అమల్లోకి రానున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జీతం ఖాతా ( ) కలిగిన ఎస్బీఐ వినియోగదారులకు ఇప్పటివరకు ఇతర బ్యాంకుల ఏటీఎం/ఏడీడబ్ల్యూఎంలలో నెలకు 10 ఉచిత లావాదేవీలు ఉండేవి. దీనిని 5కు తగ్గిస్తూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ 5 లావాదేవీలలో నగదు విత్డ్రాయల్తో పాటు బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా కలిసి ఉంటాయి.












