అందోల్, 2026-08-06
తెలంగాణ ఉద్యమ ప్రదాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతిని అందోల్జోగిపేట మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు.
తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత బలం చేకూర్చి, ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా అందోల్జోగిపేట మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు)లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు భావితరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఆయన సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు రామకృష్ణ, నేనావత్ మేఘరాణి, నాగరత్నం గౌడ్, జ్యోతిప్రదీప్ గౌడ్, మంజులశ్రీకాంత్, రేఖప్రవీణ్, శోభనారాయణ గౌడ్, శశిరేఖఅనిల్, కో-ఆప్షన్ సభ్యులు ముంతాజ్ బేగం అక్బర్, జీషన్, టీపీవో నిహాల్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘనంగా నివాళులర్పించారు.











