జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో షబ్బీర్ ఫౌండేషన్, దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలను కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
విజయదశమి అంటేనే చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీక అని, ప్రజలందరూ శాంతియుతంగా, ఐక్యంగా ఉన్నప్పుడే సమసమాజం శాంతిభద్రతలతో, ధర్మ పరిరక్షణతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆమె ఆకాంక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఉత్సవాలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచనల మేరకు తాగునీటి సదుపాయం, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవం విజయవంతం కోసం అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.












