వై.ఎస్.ఆర్ కడప, 9 September
కడప నగరంలో వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ పి. భవాని ప్రసాద్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్డీవో, ఇరిగేషన్, కేసీ కెనాల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కడప నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ పి. భవాని ప్రసాద్, కడప ఆర్డీవో, ఇరిగేషన్ శాఖ అధికారులు, కేసీ కెనాల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బుధవారం నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా దేవుని కడప చెరువు, దుర్గమ్మ గుడి పక్కన ఉన్న కేసీ కెనాల్, ఇర్కాన్ సర్కిల్ సమీపంలోని కేసీ కెనాల్, ఫాతిమా కళాశాల వద్ద ఉన్న కేసీ కెనాల్ ప్రాంతాలను అధికారులు సందర్శించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు, నిమజ్జన ఏర్పాట్లు, వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.












