కామారెడ్డి, 9 September
చిన్న మల్లారెడ్డి గ్రామంలో గణేష్ మండపాల నిర్వాహకులతో అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన సూచనలు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చిన్న మల్లారెడ్డి గ్రామంలో గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, దేవనపల్లి ఎస్ఐ రంజిత్ హాజరై, గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ నీలం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజా గౌడ్, గ్రామ పెద్దలు రామా గౌడ్, ఆనందరావు, గ్రామ పోలీసు అధికారి శ్రీకాంత్‌తో పాటు గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఉత్సవాలను పరస్పర సహకారంతో, శాంతియుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయించారు.












