వైఎస్సార్ కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మండలం జ్యోతి క్షేత్రం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో భారీగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కంటైనర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ దుంగల విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు జ్యోతి క్షేత్రం పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా వస్తున్న ఒక కంటైనర్ లారీని ఆపి తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 60 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కంటైనర్‌లో ఉన్న ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఈ దుంగలను అక్రమంగా నరికి, కంటైనర్ ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.












