కౌలుకు తీసుకున్న భూమికి డబ్బులు అడిగినందుకు 75 ఏళ్ల వృద్ధుడిపై దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి అన్నమయ్య జిల్లా కోర్టు ఏడాది జైలు శిక్ష, 5,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీసులు పటిష్టమైన సాక్ష్యాధారాలతో నేరాన్ని రుజువు చేయడంతో ఈ శిక్ష పడింది.
అన్నమయ్య జిల్లా, సంబేపల్లి మండలం, శెట్టిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కడియలవాండ్లపల్లి గ్రామానికి చెందిన మద్దిపట్ల నారాయణ తన వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన కడియాల పాపయ్యకు కౌలుకు ఇచ్చాడు. కౌలు గడువు ముగిసినప్పటికీ పాపయ్య డబ్బులు చెల్లించకుండా ఎగవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో తన కౌలు డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు ఆగ్రహించిన పాపయ్య, వృద్ధుడైన నారాయణపై భౌతికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కేసు నమోదు, దర్యాప్తు












