జిల్లా కార్యాలయంలో చీఫ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ () సి.ఎస్. వర్మ తన చాంబర్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒక ఉద్యోగి బదిలీ విషయంలో లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలతో ఆయన గత మూడు నెలలుగా సస్పెన్షన్‌లో ఉన్నారు.
చీఫ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ () సి.ఎస్. వర్మ తన విధులు నిర్వహించిన చాంబర్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో తోటి సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఒక ఉద్యోగి బదిలీ విషయంలో లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడంతో, దాదాపు మూడు నెలల క్రితం ఉన్నతాధికారులు వర్మను సస్పెన్షన్‌లో ఉంచారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందాల్సి ఉన్న తరుణంలో ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.












