తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం కింద పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళా భద్రత, సైబర్ నేరాలపై ప్రజలను చైతన్యపరిచారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్సై స్థాయి నుండి పై అధికారుల వరకు స్వయంగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళలు, బాలికల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మండలం పూడూరు గ్రామంలో అడిషనల్ ఎస్పీ (ఎల్ అండ్ ఓ) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గంజాయి, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలు, మహిళలపై నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, అక్రమ రవాణా సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.












