సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కష్టపడి సంపాదించిన డబ్బును సైబర్ నేరగాళ్ల చేతుల్లో పెట్టుకోవద్దని కామారెడ్డి పట్టణ సీఐ నరహరి సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో శనివారం కామారెడ్డి పట్టణంలో కళాశాల విద్యార్థులతో ఫ్లాష్వాక్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ నరహరి మాట్లాడుతూ.. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడుతూ ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును అక్రమ మార్గాల్లో దోచుకుంటున్నారని తెలిపారు. ఫోన్ కాల్స్, నకిలీ లింకులు, ఓటీపీలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదని అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ ఫ్లాష్వాక్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.












