ఫినో బ్యాంక్ CEO రిషి గుప్తాను డీజీజీఐ హైదరాబాద్ విభాగం అరెస్ట్ చేసింది. ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను కోర్టు 14 రోజుల రిమాండ్‌కు తరలించింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గాడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) హైదరాబాద్ అధికారులు ఫినో బ్యాంక్ CEO రిషి గుప్తాను అరెస్ట్ చేశారు. ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలలో భాగంగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు, రూ. 13 కోట్ల మేర ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ జరిగినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ వ్యవహారంలో ఫినో బ్యాంక్ ద్వారా అధిక మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఫినో బ్యాంక్ సుమారు రూ. 840 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.











