జగిత్యాల జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలం పూడూర్ గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
పోలీసుల వివరాల ప్రకారం, కరీంనగర్‌లోని ఓ విద్యుత్ పరికరాల దుకాణంలో పనిచేస్తున్న సంపత్‌లాల్ (30), ఈశ్వర్ సింగ్ (25) తమ స్నేహితుడు అంబారాంతో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రమాద తీవ్రతకు సంపత్‌లాల్, ఈశ్వర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందగా, వారితో పాటు ప్రయాణిస్తున్న అంబారాంకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గుర్తుతెలియని వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది.












